సోనూసూద్‌కి తెలంగాణ వాసి విగ్రహం

ABN , First Publish Date - 2020-12-21T21:16:27+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా, మద్దూరు మండలం.. దుబ్బ తండా పరిధిలోని చెలిమి తండాకు చెందిన రాజేశ్‌ రాథోడ్‌ సోనూసూద్‌ విగ్రహం ఏర్పాటు చేశాడు.

సోనూసూద్‌కి తెలంగాణ వాసి విగ్రహం

కోవిడ్‌ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న మధ్యతరగతి, పేద ప్రజలకు సాయం చేసిన సోనూసూద్‌ రియల్‌ హీరో అయ్యాడు. ఎమీ ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తున్న ఈ నటుడిని ఇప్పుడు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. తమి షాప్‌లకు సోనూసూద్‌ పేరు పెట్టుకున్నారు కొందరు. కొందరు తమ పిల్లలకు సోనూసూద్‌ పేరు పెట్టుకున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా గుడులు కట్టేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా, మద్దూరు మండలం.. దుబ్బ తండా పరిధిలోని చెలిమి తండాకు చెందిన రాజేశ్‌ రాథోడ్‌ సోనూసూద్‌ విగ్రహం ఏర్పాటు చేశాడు. రాజేశ్‌ తన సొంత ఖర్చుతో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. స్థానికులు ఈ విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. దేవతలకు పూజలు నిర్వహిచినట్లే సోనూసూద్‌కు పూజలు చేస్తామని రాజేశ్‌ ఈ సందర్భంగా తెలిపాడు. దీనిపై సోనూసూద్‌ 'నేను అందుకు అర్హుడిని కాను' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 
Updated Date - 2020-12-21T21:16:27+05:30 IST