మార్చిలో మొదలు

ABN , First Publish Date - 2020-02-26T05:36:11+05:30 IST

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కొత్తగా కనిపిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గుండుతో... కాస్త బరువు తగ్గి స్లిమ్‌గా, సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో స్టైలిష్‌గా ఉన్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను...

మార్చిలో మొదలు

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కొత్తగా కనిపిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గుండుతో... కాస్త బరువు తగ్గి స్లిమ్‌గా, సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో స్టైలిష్‌గా ఉన్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి కథానాయకుడిగా నటించనున్న సినిమా కోసం ఆ లుక్‌లోకి వచ్చారు. త్వరలో అదే లుక్‌తో సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. మార్చి రెండో తారీఖు నుండి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో మూడో సినిమా చిత్రీకరణలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. అఘోరాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు రొమాంచిత అనుభూతి ఇస్తాయట! ఈ చిత్రంలో బాలకృష్ణకు జంటగా అంజలిని ఎంపిక చేసినట్టు తెలిసింది.

Updated Date - 2020-02-26T05:36:11+05:30 IST