నా గుర్తింపు ఎందుకు కోల్పోవాలి?

ABN , First Publish Date - 2020-02-08T05:56:07+05:30 IST

‘‘కెరీర్‌ బిగినింగ్‌ నుంచి నేను సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా. నచ్చిన కథల్నే అంగీకరిస్తున్నా. చేసిన పాత్రను మళ్లీ చేయడం నాకు నచ్చదు. మధ్యలో కొంతగ్యాప్‌ ...

నా గుర్తింపు ఎందుకు కోల్పోవాలి?

‘‘కెరీర్‌ బిగినింగ్‌ నుంచి నేను సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా. నచ్చిన కథల్నే అంగీకరిస్తున్నా. చేసిన పాత్రను మళ్లీ చేయడం నాకు నచ్చదు. మధ్యలో కొంతగ్యాప్‌ రావడానికి నాకు నచ్చిన కథలు రాకపోవడం కారణం. అర్థం లేని సినిమాలు చేసి నా గుర్తింపును ఎందుకు పోగొట్టుకోవాలి’’ అని కేథరిన్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ సరసన ఆమె నటించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కె. వల్లభ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా కేథరిన్‌ శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. 


క్రాంతిమాధవ్‌ నెరేషన్‌ ఇచ్చాక ఆయన దర్శకత్వం వహించిన ‘ఓనమాలు’, ‘మళ్లీమళ్లీ ఇదిరాని రోజు’ చిత్రాలు చూశా. ఆయనొక గొప్ప రచయిత అనీ, రచన ఆయన బలం అని అర్థమైంది. ఈ సినిమాకు ఆ కథ, ఆయన క్రియేట్‌ చేసిన పాత్రలు బలం అని తెలిసింది. ఇందులో నలుగురు హీరోయిన్‌లతోపాటు చాలామంది ఆర్టిస్ట్‌లు నటించారు. కొన్ని సందర్భాల్లో అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్‌ ఉండకపోవచ్చు. ఇందులో ప్రతి పాత్రలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది.


నీలా ఉంటే చాలన్నారు...

కథ వినగానే దర్శకుణ్ణి కొన్ని రొటీన్‌ ప్రశ్నలు అడగడం నాకు అలవాటు. క్రాంతిని కూడా అలాగే అడిగా. ఈ పాత్ర కోసం నేనేమన్నా ప్రత్యేకంగా తయారు కావాలా? కొత్తగా ఏమన్నా ట్రై చేయాలా అని అడిగాను.  ‘ఏం అవసరం లేదు. మీరు ఎలా ఉంటారో అలా ఉంటే చాలు’ అన్నారు. ఇందులో నా క్యారెక్టర్‌ పేరు స్మిత. మోడ్రన్‌గా, మెచూర్డ్‌గా ఉండే అమ్మాయి. మిగిలిన ముగ్గురు హీరోయిన్‌లతో నాకు కాంబినేషన్‌ సీన్స్‌ లేవు. విజయ్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ బావుంది. ఈ సినిమాకు మెయిన్‌ ఎట్రాక్షన్‌ కథే. మేమంతా జస్ట్‌ క్యారెక్టర్స్‌ అంతే! నిడివితో సంబంధం లేకుండా స్మిత పాత్రకు మంచి పేరొస్తుందనే నమ్మకం ఉంది. నిజజీవితంలో అయినా, సినిమాలో అయినా ఒకరితో బంధం కొనసాగించడం, ప్రేమించడం అనేది చాలా కష్టమని నా అభిప్రాయం. ఇందులో నాకూ, విజయ్‌కు మధ్య అలాంటి  సన్నివేశాలు ఉన్నాయి. ప్రతి సీన్‌ ఆకట్టుకుంటుంది. 


సినిమాకు బలం కావాలి! 

నేనొక సినిమా చేశానంటే నా నటన సినిమాకు బలం కావాలి. కానీ తగ్గించేలా ఉండకూడదు. నా వల్ల ఫలానా సీన్‌ చెడిపోయిందని నా చెవిన పడితే అసలు తట్టుకోలేను. ఇప్పటి వరకూ ఐతే అలాంటి సిచ్చువేషన్‌ ఎదురుకాలేదు. ఏ రంగంలోనైనా మనకు ఒక రూపాయి వస్తుందంటే అది మనం చేసే పనిని బట్టే కదా! ఆ విలువను నేను నిలబెట్టుకుంటా. బాక్సాఫీస్‌ లెక్కలతో సంబంధం లేకుండా ‘కేథరిన్‌ బాగా నటించింది, తన పాత్ర సినిమాకు ఉపయోగపడింది’ అన్న పేరు తెచ్చుకోవడం కోసమే తపన పడుతుంటా. 


ప్రేమ మీద గౌరవముంది...

ప్రేమ మీద నాకు మంచి అభిప్రాయముంది. అదొక ఎమోషన్‌. అమ్మాయి, అబ్బాయి మధ్య ఉన్నదే ప్రేమ కాదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరి మధ్య ప్రేమ ఉంటుంది. నేను ఆ ప్రేమను గౌరవిస్తాను. సహజీవనం అనేది అందరికీ సరిపడదు. ఓ మనిషిని అర్థం చేసుకొని, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటే అది కరెక్టే. పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే జీవితకాల ఒప్పందం. ఆ ప్రేమ, పెళ్లి వ్యవహారాన్ని గౌరవిస్తా. 


అది నిర్మాతే చెప్పాలి...

అర్థవంతమైన సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం. నాకు కామిక్‌ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అలాంటి పాత్రలు చేసే అవకాశం ఇంకా రాలేదు. ప్రస్తుతం తమిళంలో ఓ మంచి కథ చేస్తున్నా. బోయపాటి- బాలకృష్ణ సినిమాలో నేను ఉన్నానా లేదా అన్నది ప్రొడక్షన్‌ హౌస్‌ చెప్పాలి.

Updated Date - 2020-02-08T05:56:07+05:30 IST