స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ ముచ్చట్లు!

ABN , First Publish Date - 2020-10-08T19:40:24+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ ప్రముఖులు తము చెప్పాలనుకుంటున్న వాటిని నేరుగా అభిమానులతో పంచుకుంటున్నారు.

స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ ముచ్చట్లు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ ప్రముఖులు తము చెప్పాలనుకుంటున్న వాటిని నేరుగా అభిమానులతో పంచుకుంటున్నారు. తమ వ్యక్తిగత, వృత్తిగత విశేషాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తున్నారు. కొందరు హీరోయిన్లు తమ హాట్ హాట్ ఫొటోషూట్లను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ బీచ్‌లో బికినీ వేసుకుని తీయించుకున్న తన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అలాగే ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ చీరలో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఇక, బాలీవుడ్ ప్రముఖ హీరో టైగర్ ష్రాఫ్ తన వర్కవుట్ వీడియోను పోస్ట్ చేశాడు. అలాగే ప్రముఖ యాంకర్ ఝాన్సీ భగవద్గీత శ్లోకాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక, ఆమిర్ ఖాన్ కూతురు ఐరా తనలో ఉన్న ట్యాలెంట్‌ను బయటపెట్టింది. ఇక, బాలీవుడ్ ప్రముఖ కథానాయిక శిల్పా శెట్టి తన కుమారుడి స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ గురించి వెల్లడించింది. రియల్ హీరో సోనూ సూద్‌కు సంబంధించి తన కొడుకు వియాన్ ప్రాజెక్ట్ చేసినట్టు తెలిపింది.
Updated Date - 2020-10-08T19:40:24+05:30 IST