స్టార్స్ ఇన్‌స్టాగ్రమ్‌ ముచ్చట్లిలా ఉన్నాయ్‌..

ABN , First Publish Date - 2020-10-05T04:08:50+05:30 IST

సండే కావడంతో స్టార్స్ అంతా సోషల్‌ మీడియాపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. వారి తాజా అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా షేర్ చేసి.. అభిమానులను, నెటిజన్లను ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశారు. రౌడీ హీరో విజయ్

స్టార్స్ ఇన్‌స్టాగ్రమ్‌ ముచ్చట్లిలా ఉన్నాయ్‌..

సండే కావడంతో స్టార్స్ అంతా సోషల్‌ మీడియాపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. వారి తాజా అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా షేర్ చేసి.. అభిమానులను, నెటిజన్లను ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశారు. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ.. 'పని చేసి చేసి పిచ్చెక్కిపోయినప్పుడు.. నటుడిని కావడం వల్ల ఉండే కొన్ని అసౌకర్యాల నుంచి తప్పించుకునేందుకు, మరీ ముఖ్యంగా అక్కడే దొరికే అద్భుతమైన ఫుడ్ కోసం యూరప్‌కి వెళ్లాలని అనిపిస్తోంది' అని చెబుతూ.. ఓ ఆసక్తికర ఫొటోని షేర్‌ చేశారు. 'నన్ను నేను ఆకట్టుకునేలా డ్రస్ వేసుకుంటాను.. ఎందుకంటే నేను మిలియన్‌లో ఒకరిని కాను. 7 బిలియన్లలో ఒకరిని..' అని మంచు లక్ష్మీ కొన్ని లేటెస్ట్ ఫొటోలను షేర్‌ చేశారు. నటి రేణు దేశాయ్‌ తన కూతురితో ఉన్న జోష్‌ ఫుల్‌ ఫొటోని షేర్‌ చేసి.. ఈ ప్రేమకు ఎటువంటి షరతుల్లేవ్‌.. అని తెలిపారు. అద్దంలో కనిపించేవి.. ఒరిజినల్‌ కంటే కూడా క్యూట్‌గా ఉంటాయని ఓ హాట్‌ ఫొటోని షేర్ చేశారు లావణ్య త్రిపాఠి. సముద్రమపు అంచును కూర్చుని ఉన్న అమలాపాల్‌ వెలిగిపోండి ఇప్పుడే అంటూ అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి నది వద్ద ఊయల ఊగుతున్న ఫొటోలను సాయిపల్లవి పోస్ట్ చేసింది. హేయ్‌ నాటీ అంటూ అనుపమా పరమేశ్వరన్‌ ఓ క్యూట్‌ ఫొటోని షేర్ చేసింది.Updated Date - 2020-10-05T04:08:50+05:30 IST

Read more