స్టార్స్ ఇన్‌స్టా ముచ్చట్లు!

ABN , First Publish Date - 2020-10-09T21:50:17+05:30 IST

`నా దీపావళి బహుమతి అప్పుడే వచ్చేసింది. సాయిబాబా ఉంగారాన్ని మా అమ్మ నాకు ఇచ్చింది.

స్టార్స్ ఇన్‌స్టా ముచ్చట్లు!

* `నా దీపావళి బహుమతి అప్పుడే వచ్చేసింది. సాయిబాబా ఉంగారాన్ని మా అమ్మ నాకు ఇచ్చింది. తను ఎనిదేళ్ల వయసులో ఉన్నప్పుడు మా అమ్మకు వాళ్లమ్మ ఇలాంటి ఉంగరాన్నే ఇచ్చిందట. అది ఇప్పటికీ అమ్మ చేతికి ఉంది. ఇప్పుడు నా వంతు. నాకు చాలా నచ్చింది. థాంక్యూ అమ్మా` అని మహేష్ కూతురు సితార పేర్కొంది. 


* `నా టీమ్‌ సభ్యులు నన్ను వారి గురించి ఆలోచించే తల్లిలా భావిస్తారు` అంటూ రష్మిక తన టీమ్ సభ్యులు మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. 


* `భూమి భవిష్యత్తు అంతా మానవుల చేతుల్లోనే ఉంది. దీని గురించి అవగాహన కల్పిస్తూ 10.10.2020న నేను ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నా. దానిలో పాల్గొనడానికి మీరు సిద్ధంగా ఉన్నారా`  అంటూ ప్రియాంక ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 


* `లక్ష్మీబాంబ్` సినిమా షూటింగ్ సందర్భంగా అక్షయ్ కుమార్‌తో కలిసి దిగిన ఫొటోను కియారా ఆడ్వాణీ పంచుకుంది. 


* ఇంట్లోనే వ్యాయామం చేస్తున్న వీడియోను బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ పంచుకుంది. 


ఇంకా మరెందరో తారలు తమ వ్యక్తిగత, వృత్తిగత విశేషాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. 
Updated Date - 2020-10-09T21:50:17+05:30 IST