50 ఏళ్ళ మైలురాయిని చేరుకున్న స్టార్‌ నిర్మాత

ABN , First Publish Date - 2020-12-18T03:03:29+05:30 IST

హిందీలో 'దిల్ లగానా' అంటే 'మనసు పెట్టటం' అని అర్థం. పేరుకు తగ్గట్టే... దిల్ రాజు, డబ్బు పెట్టి కాదు, మనసు పెట్టి సినిమాలు నిర్మిస్తారు. అందుకే, 50 ఏళ్ల వయస్సులోనూ

50 ఏళ్ళ మైలురాయిని చేరుకున్న స్టార్‌ నిర్మాత

హిందీలో 'దిల్ లగానా' అంటే 'మనసు పెట్టటం' అని అర్థం. పేరుకు తగ్గట్టే... దిల్ రాజు, డబ్బు పెట్టి కాదు, మనసు పెట్టి సినిమాలు నిర్మిస్తారు. అందుకే, 50 ఏళ్ల వయస్సులోనూ, ఆయన దిల్ దార్ గా సినిమాలు రూపొందిస్తూ... అగ్ర నిర్మాతగా దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌ను శాసించే అతి తక్కువ మందిలో ఆయన కూడా ఒకరయ్యారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50 ఏళ్ళ మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి తెలుగు సినీ ప్రముఖులకి గ్రాండ్ పార్టీ ప్లాన్ చేశారు. కరోనా లాక్ డౌన్ కాలంలో దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు సెలబ్రేషన్స్ ఏమీ లేకుండా సింపుల్‌గా వివాహా తంతు కానిచ్చేశారు. అందుకే, ఇప్పుడు 'దిల్ రాజు 50 ఇయర్స్' పార్టీలో తన మిత్రులు, శ్రేయోభిలాషులకి మన స్టార్ ప్రొడ్యూసర్... ఫార్మల్‌గా భార్యని పరిచయం చేస్తారట.


ఏజ్ పరంగా, 50 ఇయర్స్ మైల్ స్టోన్ క్రాస్ చేసిన సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు... గత ఇరవై ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగంలో కీలకంగా కొనసాగుతున్నారు. 2003లో 'దిల్' చిత్రంతో నిర్మాత అయిన ఆయన పరిశ్రమని తనదైన రీతిలో శాసించగల బడా డిస్ట్రిబ్యూటర్ కూడా. అయితే, చాలా మంది ఇతర పేరు మోసిన ప్రొడ్యూసర్స్ లా కాక ఈయన డైరెక్ట్ గా సినిమా ఔట్ పుట్‌ని నిర్దేశిస్తారు. డబ్బుల సంచులు గుమ్మరించి తన పని అయిపోయిందనుకునే వ్యక్తి కాదు దిల్ రాజు. తన ప్రాజెక్ట్స్ విషయంలో, ప్రతీ దశలో ఆయన యాక్టివ్ గా పాలుపంచుకుంటారు. అందుకే, హీరోలు, దర్శకులకి ఉన్నట్టుగా ప్రేక్షకుల్లో దిల్ రాజుకి గుర్తింపు ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ హిట్ కంటెంట్ గ్యారెంటీగా భావిస్తారు. అలాంటి రేర్ ఇమేజ్ దిల్ రాజు సంపాదించుకున్నారు. 'వకీల్ సాబ్, ఎఫ్‌ 3, థాంక్యూ' లాంటి క్రేజీ చిత్రాలు ప్రస్తుతం ఆయన ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2020-12-18T03:03:29+05:30 IST