దేశంలోనే నెంబర్ 1 ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌

ABN , First Publish Date - 2020-10-18T00:12:23+05:30 IST

సన్ టీవీని దాటి స్టార్ మా ముందుకు వెళ్లి దేశంలోనే ఎక్కువ మంది వీక్షించే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌గా అవతరించింది. తాజాగా విడుదల అయిన రేటింగ్స్‌లో స్టార్ మా ఈ ఘనత సాధించిందని స్టార్ మా

దేశంలోనే నెంబర్ 1 ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌

సన్ టీవీని దాటి స్టార్ మా ముందుకు వెళ్లి దేశంలోనే ఎక్కువ మంది వీక్షించే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌గా అవతరించింది. తాజాగా విడుదల అయిన రేటింగ్స్‌లో స్టార్ మా ఈ ఘనత సాధించిందని స్టార్ మా ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని రీజినల్ ఛానెల్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్న స్టార్ మా ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌గా మారింది.


బ్లాక్ బస్టర్ సినిమాలు, ప్రముఖ తారలతో కూడిన ఈవెంట్లు, లైవ్ కార్యక్రమాలు స్టార్ మాలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తెలుగులో పాపులర్ సీరియల్స్ తో స్టార్ మా ముందున్నది. 42 శాతం వీక్షకులను ఆకట్టుకుంటున్న వదినమ్మ, కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి, తాజాగా ప్రారంభమైన దేవత, కస్తూరి తదితర కార్యక్రమాలతో స్టార్ మా ముందుకు వెళుతున్నది. బిగ్ బాస్, సిక్స్త్ సెన్స్, ఇస్మార్ట్ జోడీ లాంటి రియాలిటీ షో లు కూడా మా టీవీని ప్రేక్షకులకు దగ్గర చేశాయి.



Updated Date - 2020-10-18T00:12:23+05:30 IST