బిగ్‌బాస్‌: నాగ్‌ ప్లేస్‌లో వచ్చే దెవరో తెలిసిపోయింది

ABN , First Publish Date - 2020-10-25T01:03:38+05:30 IST

బుల్లితెరపై కింగ్‌ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 4కి సంబంధించి తాజాగా కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆ వార్తలు ఏమిటంటే.. ప్రస్తుతం ఈ షోకి

బిగ్‌బాస్‌: నాగ్‌ ప్లేస్‌లో వచ్చే దెవరో తెలిసిపోయింది

బుల్లితెరపై కింగ్‌ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 4కి సంబంధించి తాజాగా కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆ వార్తలు ఏమిటంటే.. ప్రస్తుతం ఈ షోకి హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున 'వైల్డ్ డాగ్‌' చిత్ర షూటింగ్‌ నిమిత్తమై మనాలీలో ఉన్నాడు. మరి ఈ వారం బిగ్‌బాస్‌ని హోస్ట్ చేసేది ఎవరు? గతంలో ఒకసారి ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు శివగామి రమ్యకృష్ణ షో ని నడిపించారు. మరి ఇప్పుడెవరు? వస్తారు.. అంటూ.. సోషల్‌ మీడియా వేదికగా చర్చలు నడుస్తున్నాయి. అయితే నాగ్‌ ప్లేస్‌లో ఈ వారం హోస్ట్ విషయంలో ఆయన కోడలు సమంత, ఇంకా రోజా పేరు కూడా వినబడింది. ఇక ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. ఈవారం హోస్ట్ చేయబోతున్నది ఎవరో తెలుపుతూ.. స్టార్‌ మా ఓ ప్రోమోను విడుదల చేసింది.


బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4.. ఈ వారం షోని హోస్ట్ చేయబోయేది మరెవరో కాదు.. అక్కినేని కోడలు సమంతే. తాజాగా సమంత ప్రోమోని విడుదల చేశారు. అయితే బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు కన్ఫ్యూజ్‌ మాత్రం తప్పలేదు. అదేంటంటే.. వీకెండ్‌లో అంటే శని, ఆది వారాలు హోస్ట్ కనిపిస్తారు. కానీ సమంత ప్రోమోలో ఆమె ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరి శనివారం సంగతేంటి?. సాయంత్రం 6గంటల నుంచి అంటున్నారంటే.. శనివారం, ఆదివారం షో కలిపి.. దసరా స్పెషల్‌గా ఈ షో ప్లాన్‌ చేశారా?. ఏమో.. ఇది బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు ఇచ్చిన టాస్క్‌లా అనిపిస్తుంది.

Updated Date - 2020-10-25T01:03:38+05:30 IST

Read more