నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం...
ABN , First Publish Date - 2020-10-23T06:53:24+05:30 IST
కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నటుడు, హీరో రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి...
 
                            
కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నటుడు, హీరో రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, రాజశేఖర్ ఆరోగ్యం బాగానే ఉందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని ఆయన భార్య జీవిత తెలిపారు. దయచేసి అసత్య వార్తలను నమ్మవద్దని, ఎవరూ కూడా ఈ విషయంపై ప్రచారం చేయొద్దని, రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించండని కోరారు. ఇదిలా ఉండగా, నటుడు రాజశేఖర్  కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, నటుడు మోహన్‌బాబు ఆకాంక్షించారు.  రాజశేఖర్ కుటుంబానికి ధైర్యం చెబుతూ ట్వీట్‌చేశారు.