బాలయ్యతో మూవీ.. రాజమౌళి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2020-04-28T04:48:11+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కూడా ఆగిపోవడంతో

బాలయ్యతో మూవీ.. రాజమౌళి ఏమన్నారంటే..

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కూడా ఆగిపోవడంతో ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఇంటి వద్ద నుంచే ఆ సినిమాకి చేయాల్సిన పనులు చూసుకుంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబుతో మూవీ అనే విషయం బయటికి వస్తే, పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ప్రయత్నించి కూడా కుదరలేదని చెప్పడం వంటివి బాగా హైలెట్ అయ్యాయి. ఇప్పుడు మరో హైలెట్.. ఆయన చెప్పిన విషయాల నుంచి బయటికి వచ్చింది. అదేమంటే నందమూరి నటసింహం బాలయ్యతో మూవీ.


‘‘ప్రతి దర్శకుడికి హీరోలందరితో సినిమా చేయాలని ఉంటుంది. అందులో ముఖ్యంగా స్టార్ హీరోలందరితో సినిమా చేసి.. దర్శకులు తమ స్థాయిని పెంచుకోవాలని చూస్తారు. ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ హీరో అయితే సరిపోతాడు అని దర్శకులకి అనిపిస్తుంది. అలా నాకు కొన్ని కథలు విన్నప్పుడు బాలకృష్ణగారైతే బాగుంటుంది అనిపించింది. కానీ ఆయనతో సినిమా చేయడానికి మాత్రం వీలుపడలేదు..’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫస్ట్ రోజే ఆ సినిమాని రాజమౌళి చూస్తుంటాడనే విషయం అందరికీ తెలిసిందే.

Updated Date - 2020-04-28T04:48:11+05:30 IST