నా టాస్క్ పూర్తయింది.. వారిని నామినేట్ చేస్తున్నా: రాజమౌళి

ABN , First Publish Date - 2020-04-20T21:40:04+05:30 IST

కోవిడ్ 19 కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్‌డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల‌తో పాటు ప్ర‌ముఖులంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సినీ సెల‌బ్రిటీస్ విష‌యానికి వ‌స్తే

నా టాస్క్ పూర్తయింది.. వారిని నామినేట్ చేస్తున్నా: రాజమౌళి

కోవిడ్ 19 కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్‌డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల‌తో పాటు ప్ర‌ముఖులంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సినీ సెల‌బ్రిటీస్ విష‌యానికి వ‌స్తే అంద‌రూ ఇంటి పనులు, వంట ప‌నులు చేయ‌డం, సినిమాలు చూడటం, పుస‌క్తాలు చ‌ద‌వ‌డ‌ం, పిల్ల‌ల‌తో కాల‌క్షేపం చేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. ఈ స‌మ‌యంలో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ మ‌గ‌వారికి ‘బీ ది రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్ విసిరారు. ఆయన ఇంటి పనులు చేస్తున్న వీడియోని షేర్ చేసి.. దర్శకధీరుడు రాజ‌మౌళిని ఈ ఛాలెంజ్‌కు ఆయ‌న నామినేట్ చేశారు. ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి ప‌నులు చేస్తున్న వీడియో ఒక‌టి పోస్ట్ చేయాల‌ని రాజ‌మౌళిని రిక్వెస్ట్ చేశారు సందీప్ వంగా. సందీప్ ఛాలెంజ్‌కు రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. సోమవారం త‌ను ప‌నిచేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తాన‌ని రాజ‌మౌళి తెలిపారు. చెప్పినట్లుగానే ఆయన ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి ఇంట్లో పనిచేస్తున్న వీడియోని షేర్ చేశారు. 


‘‘సందీప్ వంగా ఇచ్చిన టాస్క్ పూర్తి చేశాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌కు నేను కూడా కొందరినీ నామినేట్ చేస్తున్నాను. తారక్, రామ్ చరణ్‌లను నామినేట్ చేస్తున్నాను. వీరినే కాకుండా ఇంకొంచెం ఫన్ ఈ ఛాలెంజ్‌కు యాడ్ చేయాలని భావిస్తున్నాను. అందుకే నిర్మాత శోభు యార్లగడ్డని, దర్శకుడు సుకుమార్ మరియు పెద్దన్న ఎమ్.ఎమ్. కీరవాణిని కూడా నామినేట్ చేస్తున్నాను. బీ ది రియ‌ల్ మేన్‌’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-04-20T21:40:04+05:30 IST