శ్రుతిహాసన్ ‘ఎడ్జ్’
ABN , First Publish Date - 2020-08-08T17:35:12+05:30 IST
లాక్‌డౌన్ సమయంలోనూ శ్రుతి సంగీతంపైనే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా శ్రుతి ‘ఎడ్జ్’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు.
దక్షిణాదినే కాదు.. ఉత్తరాదిన కూడా హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న నేటి తరం హీరోయిన్స్‌లో శ్రుతిహాసన్ ఒకరు. ఈమె హీరోయిన్ కావడానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్‌గానే వర్క్ చేశారు. ఏమాత్రం ఖాళీ దొరికినా మ్యూజిక్ షోస్ చేయడానికి శ్రుతి హాసన్ ఆసక్తి చూపుతుంటారు. ఈ లాక్‌డౌన్ సమయంలోనూ శ్రుతి సంగీతంపైనే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా శ్రుతి ‘ఎడ్జ్’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. అందులో ‘టేక్ మి టేక్ మి టు ఎడ్జ్..’ అనే సాంగ్‌ను శ్రుతి శనివారం విడుదల చేశారు. ప్రతి ఒక్కరిలో అసంపూర్ణమైన ప్రేమను తెలియజేప్పే ప్రయత్నమే ఇది అని శ్రుతి తెలిపారు. ఈ ఆల్బమ్‌కు శ్రుతిహాసన్ సంగీతం సమకూర్చడంతో పాటు పాడారు కూడా.
Read more