నృత్య కళాకారిణిగా శ్రుతిహాసన్‌

ABN , First Publish Date - 2020-08-19T13:42:24+05:30 IST

ఎస్పీ జననాధన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లాభం’ చిత్రంలో అందాల భామ శ్రుతిహాసన్‌ గ్రామీణ నృత్యకళాకారిణి పాత్రలో నటిస్తున్నారు.

నృత్య కళాకారిణిగా శ్రుతిహాసన్‌

ఎస్పీ జననాధన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లాభం’ చిత్రంలో అందాల భామ శ్రుతిహాసన్‌ గ్రామీణ నృత్యకళాకారిణి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. డి. ఇమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్‌సేతుపతి, పి.ఆర్ముగకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి సంఘసేవకుడిగా నటిస్తున్నారని, అతడి సేవలను చూసి మెచ్చుకుని శ్రుతి హాసన్‌ ప్రేమలో పడుతుందని ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే మిగిలిన కథాంశమని దర్శకుడు ఎస్పీ జననాథన్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత శరవేగంగా షూటింగ్‌ చేస్తామని ఆయన వివరించారు.

Updated Date - 2020-08-19T13:42:24+05:30 IST