నటీనటులు కావాలంటున్న ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌

ABN , First Publish Date - 2020-10-25T20:04:22+05:30 IST

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై ఒకవైపు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాత రామ్‌ తాళ్లూరి ఇప్పుడు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ సినిమాను ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన కాస్టింగ్‌ కాల్‌కు పిలుపునిచ్చారు నిర్మాతరజనీ తాళ్లూరి.

నటీనటులు కావాలంటున్న ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై ఒకవైపు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాత రామ్‌ తాళ్లూరి ఇప్పుడు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ సినిమాను ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన కాస్టింగ్‌ కాల్‌కు పిలుపునిచ్చారు నిర్మాతలు రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి. రాజశేఖర్‌ 'కల్కి' సినిమాకు రైటర్‌గా పనిచేసిన దేశారాజ్‌ సాయితేజ్, డైరెక్టర్‌ రమణ తేజ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌లో రూపొందనున్న ఆరో చిత్రమిది. రామ్‌తాళ్లూరి, సాయిరిషిక ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమాను రీసెంట్‌గా అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-10-25T20:04:22+05:30 IST

Read more