భర్త చపాతీలపై శ్రీజ సెటైర్
ABN , First Publish Date - 2020-05-25T18:37:52+05:30 IST
తాజాగా చిరంజీవి రెండో అల్లుడు, హీరో కల్యాణ్‌దేవ్ కూడా శ్రీమతి శ్రీజ కోసం చపాతీలు చేసి పెట్టాడు.
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ ఏవీ లేకపోవడంతో సినీ రంగానికి చెందినవారందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. హీరోలైతే ఇంటి పనులు, వంట పనులు కూడా చేస్తున్నారు. తాజాగా చిరంజీవి రెండో అల్లుడు, హీరో కల్యాణ్‌దేవ్ కూడా శ్రీమతి శ్రీజ కోసం చపాతీలు చేసి పెట్టాడు. లాక్‌డౌన్‌లో ట్రావెల్ ఆంక్షలున్నప్పటికీ కల్యాణ్ నన్ను ఆస్ట్రేలియా, ఆఫ్రికా తీసుకెళ్లాడంటూ ఈ రొటీలపై శ్రీజ సెటైరికల్ పోస్ట్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అలాగే ‘‘చపాతీలకు ఓ ప్రత్యేకమైన ఆకారం ఉండనవసరం లేదు. టేస్టీగా ఉంటే చాలు. మీరు కూడా మీకు నచ్చిన స్టైల్లో చపాతీలను చేసి ఆ ఫొటోలను పంపితే వాటిని మా స్టేటస్‌లో పెడదామనుకుంటున్నాను’’ అని శ్రీజ తెలిపారు.
Read more