లక్కీ మీడియాలో శ్రీవిష్ణు సినిమా

ABN , First Publish Date - 2020-12-30T06:03:10+05:30 IST

శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రదీప్‌ వర్మ అల్లూరి దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్‌ ఓ సినిమా నిర్మించనున్నారు...

లక్కీ మీడియాలో శ్రీవిష్ణు సినిమా

శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రదీప్‌ వర్మ అల్లూరి దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్‌ ఓ సినిమా నిర్మించనున్నారు. యాక్షన్‌ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు ఇప్పటి వరకూ చేయని పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెడతారు. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 

Updated Date - 2020-12-30T06:03:10+05:30 IST