‘జోహార్‌’ దర్శకుడితో శ్రీవిష్ణు సినిమా?

ABN , First Publish Date - 2020-10-12T07:19:27+05:30 IST

‘జోహార్‌’ దర్శకుడు తేజ మార్నితో శ్రీవిష్ణు సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య ఓ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిసింది...

‘జోహార్‌’ దర్శకుడితో శ్రీవిష్ణు సినిమా?

‘జోహార్‌’ దర్శకుడు తేజ మార్నితో శ్రీవిష్ణు సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య ఓ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. కొత్త తరహా కథల్లో నటించడానికి శ్రీవిష్ణు ఆసక్తి చూపిస్తుంటారు. అతని కోసం సరికొత్త కథను తేజ మార్ని సిద్ధం చేస్తున్నారట. ఓటీటీలో విడుదలైన ‘జోహార్‌’తో ఆయన దర్శకుడిగా పరిచయ మయ్యారు. అది మంచి సందేశాత్మక చిత్రంగా ప్రశంసలు, వీక్షకాదరణ అందుకుంది. ఇప్పుడు గోదావరి నేపథ్యంలో నడిచే వినోదాత్మక కథతో రెండో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట. 

Updated Date - 2020-10-12T07:19:27+05:30 IST

Read more