‘దాడి’ షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే..

ABN , First Publish Date - 2020-07-28T01:29:59+05:30 IST

విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ భావాల‌తో ప్ర‌స్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి ద‌ర్శ‌క‌త్వంలో

‘దాడి’ షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే..

విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ భావాల‌తో ప్ర‌స్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి ద‌ర్శ‌క‌త్వంలో శంకర్.ఏ నిర్మాత‌గా రూపొందుతోన్న ఈ మూవీలో శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కి ముందే కొంతభాగం షూటింగ్ జ‌రుపుకున్నఈ చిత్రం చివ‌రి షెడ్యూల్ ఆగ‌స్ట్ మొద‌టి వారం నుంచిప్రారంభం కాబోతుంది. 


ఈ సంద‌ర్భంగా ‌నిర్మాత శంకర్.ఏ మాట్లాడుతూ.. ‘‘ఇటీవ‌ల ర‌వీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా విడుద‌ల‌ చేసిన మా ‘దాడి’ ఫ‌స్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు మధుశోభ ర‌వీంద్రనాథ్ ఠాగూర్‌గారి భావాలతో ఒక వ్యవస్థని కథగా రాసుకొని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న మేకింగ్ చాలా బాగుంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం అలాగే కాసర్ల శ్యామ్, భాష్యశ్రీల సాహిత్యం మా సినిమాకు త‌ప్ప‌కుండా ప్ల‌స్ అవుతుంది. మా సినిమా లాక్‌డౌన్‌కి ముందే అధిక‌భాగం షూటింగ్ పూర్తిచేశాం. మిగిలిన చివరి భాగాన్ని ఆగ‌స్ట్ 1నుంచి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే షెడ్యూల్‌లో కంప్లీట్ చేయ‌నున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. న‌టులు శ్రీరామ్, జీవన్ వారి పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది..’’ అన్నారు.

Updated Date - 2020-07-28T01:29:59+05:30 IST