తిరుపతిలో ‘శ్రీకారం’ చుట్టారు!

ABN , First Publish Date - 2020-10-09T05:06:14+05:30 IST

శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న ‘శ్రీకారం’ చిత్రం షూటింగ్‌ గురువారం తిరుపతిలో పునఃప్రారంభమైంది. ‘ఇలా మొదలైంది.. ఇలా జరుగుతోంది’ అని నిర్మాతలు లొకేషన్‌లో...

తిరుపతిలో ‘శ్రీకారం’ చుట్టారు!

శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న ‘శ్రీకారం’ చిత్రం షూటింగ్‌ గురువారం తిరుపతిలో పునఃప్రారంభమైంది. ‘ఇలా మొదలైంది.. ఇలా జరుగుతోంది’ అని నిర్మాతలు లొకేషన్‌లోని రెండు ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌  చేశారు. హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ ప్రియాంక అరుళ్‌ మోహన్‌తోపాటు నరేశ్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వ్యవసాయం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో శర్వానంద్‌ రైతుగా కనిపిస్తారు. కిశోర్‌ బి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్‌, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా,  కెమెరా: జె. యువరాజ్‌.


Updated Date - 2020-10-09T05:06:14+05:30 IST