శ్రీకారం షెడ్యూల్‌ పూర్తి!

ABN , First Publish Date - 2020-10-28T06:49:31+05:30 IST

శర్వానంద్‌, ప్రియాంకా అరుల్‌ మోహన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. లాక్‌డౌన్‌కి ముందు కొంత చిత్రీకరణ చేశారు...

శ్రీకారం  షెడ్యూల్‌ పూర్తి!

శర్వానంద్‌, ప్రియాంకా అరుల్‌ మోహన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. లాక్‌డౌన్‌కి ముందు కొంత చిత్రీకరణ చేశారు. మళ్లీ ఈ నెల 2న తిరుపతిలో చిత్రీకరణ పునఃప్రారంభించారు. తిరుపతి షెడ్యూల్‌ పూర్తయిందని చిత్రనిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ అధినేతలు గోపి ఆచంట, రామ్‌ ఆచంట తెలిపారు. ఇంకా వాళ్లిద్దరూ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అందరి సహకారంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లతో పాటు నరేశ్‌, రావు రమేశ్‌, సాయికుమార్‌, సత్య, సప్తగిరి, ఆమని పాల్గొన్నారు’’ అని తెలిపారు.


Updated Date - 2020-10-28T06:49:31+05:30 IST