శ్రీకాంత్ హీరోగా ఎన్టీఆర్ రాజ‌కీయ ‘చ‌ద‌రంగం’ స్టార్టయింది

ABN , First Publish Date - 2020-02-21T00:14:11+05:30 IST

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బహుభాషా ఓటీటీ ప్లాట్ ఫారమ్ జీ5, తన తదుపరి తెలుగు ఒరిజిన‌ల్‌ సిరీస్, చదరంగం- ఒక రాజకీయ డ్రామాను

శ్రీకాంత్ హీరోగా ఎన్టీఆర్ రాజ‌కీయ ‘చ‌ద‌రంగం’ స్టార్టయింది

ఇప్పుడు వెబ్ సిరీస్‌ల హవా ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలు కూడా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌ల గురించి ఆలోచిస్తున్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బహుభాషా ఓటీటీ ప్లాట్ ఫారమ్ జీ5, తన తదుపరి తెలుగు ఒరిజిన‌ల్‌ సిరీస్‌గా ‘చదరంగం’ అనే ఒక రాజకీయ డ్రామాను ప్రసారం చేయనుంది. శ్రీకాంత్, సునైన, నాగినీడు, కౌసల్య తదితరులు ఇందులో ప్రధాన పాత్ర‌లు పోషించారు. మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో నిర్మించిన ఈ సిరీస్‌కు రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా, జీ5లో ఫిబ్రవరి 20 నుంచి ఇది ప్రదర్శించబడుతుంది.


ఈ షో లాంచ్ వేడుకలో మంచు విష్ణు మాట్లాడుతూ... ఎన్టీరామారావు రాజ‌కీయ ప్ర‌స్థానంలో చిన్న ఎపిసోడ్ తీసుకుని ఇప్ప‌టి సిట్యూయేష‌న్‌కి లింక్ చేస్తూ చేసిన చిత్రం ఇది. ఈ సినిమా చేస్తాన‌న్న‌ప్పుడు నాన్న‌గారు చాలా చాలా చెప్పారు. చాలా జాగ్ర‌త్త‌గా తీయ‌వ‌ల‌సిన చిత్ర‌మిది అని. అలాగే వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు చూపించు అని చెప్పారు. ఈ క‌థ నా ద‌గ్గ‌రికి రాగానే ముందు నేను ప‌రుచూరి గోపాలకృష్ణ‌గారిని అడిగాను. ఆయ‌న ఇప్పుడు ఇదంతా ఎందుక‌మ్మా అని అన్నారు. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చూపిస్తాను. కొంత ఫిక్ష‌న్ క‌లిపి తీయాల‌నుకుంటున్నానని తెలపగానే.. ఆయ‌న కూడా స‌రే అని హెల్ప్ చేశారు. ఇంకా దీని కోసం జీ5 వారు మరియు ఇందులో న‌టించిన‌ ఆర్టిస్ట్‌లు అంద‌రూ కూడా ఎంతగానో త‌మ స‌హాయ స‌హ‌కారాల‌ని అందించారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించాను. ఫ్యూచ‌ర్ మొత్తం డిజిట‌ల్‌దే..’’ అని అన్నారు.


ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌ మాట్లాడుతూ.. ‘‘ఈ వెబ్‌సిరీస్‌కి మా సినిమా వాళ్ళంద‌రూ వ‌చ్చేస్తున్నారు. దీని విలువ పెరుగుతుంది. అతి త్వ‌ర‌లో చాలా మంది సినిమా పెద్ద‌లు కూడా ఇందులో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈ క‌థ నాకు చెప్పిన‌ప్పుడు విష్ణుతో.. మోహ‌న్‌బాబు ఈ సినిమాలో హీరో పాత్ర పోషిస్తే బాగుంటుంద‌ని చెప్పాను. కాని అది కుద‌ర‌లేదు. ఆయన స్థానంలో చేసిన శ్రీ‌కాంత్ అద్భుతమైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. హీరో శ్రీ‌కాంత్ న‌టించిన ఇది ఫ‌స్ట్ వెబ్ సిరీస్. ఈ సినిమాలో నా పాత్ర‌ కూడా ఉంటుంది. అది నా ఒరిజిన‌ల్ పాత్ర ఇది చాలా తక్కువ మందికి తెలుస్త‌ది. అప్ప‌టి త‌రానికి త‌ప్ప ఇప్ప‌టి వాళ్ళ‌కి తెలియ‌దు. అప్ప‌టి క‌థ‌కి ఇప్ప‌టి సిట్యూయేష‌న్స్ క‌లిపి చేశారు. నా ప్ర‌తిఘ‌టన‌ సినిమాలో నేను చెప్పిన రాజ‌కీయ మీనింగ్ ఇప్ప‌టికీ అలాగే ఉంది. దాన్ని ప్ర‌తిబింబించేలాగా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఈ ‘చ‌ద‌రంగం’ పెద్ద హిట్ అవుతుంది..’’ అన్నారు.


డైరెక్ట‌ర్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎక్క‌డా ప‌ని చేయలేదు. క‌థ వినిపించగానే విష్ణు ఓకే అన్నాడు. మొద‌ట శ్రీ‌కాంత్ ఈ చిత్రంలో న‌టించ‌డానికి కొంచం ఆలోచించారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌లు అవ‌స‌ర‌మా అనుకున్నారు. విష్ణు క‌న్విన్స్ చేయ‌డం వ‌ల్ల శ్రీ‌కాంత్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. చాలా బాగా న‌టించారు. ఇది ఆల్రెడీ త‌మిళ్‌లో పెద్ద హిట్ అయింది. తెలుగులో 20వ తారీఖున మొదలవుతుంది. ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని, అవ్వాలని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2020-02-21T00:14:11+05:30 IST