నటి శ్రీదివ్య వదిలిన ‘అర్ధ శతాబ్దం’లోని పుష్ప లుక్

ABN , First Publish Date - 2020-10-23T23:06:24+05:30 IST

బ‌తుక‌మ్మ సంబురాల‌ సంద‌ర్భంగా ‘అర్ధ శతాబ్దం’లోని `పుష్ప‌` పాత్ర లుక్‌ని ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దివ్య విడుదల చేశారు. కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత

నటి శ్రీదివ్య వదిలిన ‘అర్ధ శతాబ్దం’లోని పుష్ప లుక్

బ‌తుక‌మ్మ సంబురాల‌ సంద‌ర్భంగా ‘అర్ధ శతాబ్దం’లోని `పుష్ప‌` పాత్ర లుక్‌ని ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దివ్య విడుదల చేశారు. కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం `అర్ద శతాబ్ధం`. అందాల రాక్ష‌సి ఫేం నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకుడు. చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపులో ఉంది. ఇటీవ‌ల రానా ఈ చిత్ర ఫ‌స్ట్ గ్లిమ్స్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.


తాజాగా నటి శ్రీదివ్య విడుదల చేసిన లుక్‌ కలర్‌ఫుల్‌గా ఉండటంతో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. పుష్ప పాత్రలో కృష్ణ ప్రియ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్పలో వెంకటేష్ కుమారుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా అతని పాత్ర వైవిధ్యంగా ఉంటుందని.. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌, గ్లిమ్స్‌కి మంచి స్పందన రావడంతో సంతోషంగా ఉందని దర్శకుడు రవీంద్ర పుల్లే తెలిపారు.Updated Date - 2020-10-23T23:06:24+05:30 IST

Read more