రాశీఖన్నా చాలా సేపు వెయిట్ చేయించింది: నగ్నం హీరోయిన్

ABN , First Publish Date - 2020-07-03T21:12:29+05:30 IST

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన `నగ్నం` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లోకి వచ్చింది హీరోయిన్ శ్రీ రాపాక.

రాశీఖన్నా చాలా సేపు వెయిట్ చేయించింది: నగ్నం హీరోయిన్

`నగ్నం` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లోకి వచ్చింది హీరోయిన్  శ్రీ రాపాక. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన  ఆ సినిమాలో అత్యంత బోల్డ్‌గా నటించి వార్తల్లో నిలిచింది. ఈమె తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్‌. ఈమె ఎంతో మంది టాప్ హీరోలతోనూ, హీరోయిన్లతోనూ పనిచేసిందట. 


తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీ.. హీరోయిన్ రాశీఖన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `నేను `సుప్రీమ్` సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాను. ఆ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్. ఓ సారి చీర కట్టడం కోసం నన్ను పిలిపించింది. నిజానికి నేను అక్కర్లేదు. కానీ, కాస్ట్యూమ్ డిజైనర్‌తోనే చీర కట్టించుకుంటానని చెప్పిందట. దాంతో నేను సెట్‌కు వెళ్లాను. ఆమె కేరవేన్ బయట నన్ను చాలా సేపు వెయిట్ చేయించింది. ఎంతకీ బయటకు రాదు. ముంబై హీరోయిన్లు చాలా మంది అలాగే ఉంటార`ని శ్రీ చెప్పింది. 

Updated Date - 2020-07-03T21:12:29+05:30 IST