'శ్రీకారం' తిరుపతి షెడ్యూల్‌ పూర్తి

ABN , First Publish Date - 2020-10-27T17:54:39+05:30 IST

శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'శ్రీకారం'. కోవిడ్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఇటీవల తిరుపతిలో పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. 20 రోజులపాటు జరిగిన చిత్రీకరణతో షెడ్యూల్‌ పూర్తయ్యింది.

'శ్రీకారం' తిరుపతి షెడ్యూల్‌ పూర్తి

శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'శ్రీకారం'. కోవిడ్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఇటీవల తిరుపతిలో పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. 20 రోజులపాటు జరిగిన చిత్రీకరణతో షెడ్యూల్‌ పూర్తయ్యింది. హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ ప్రియాంక అరుళ్‌ మోహన్‌తోపాటు నరేశ్‌ సహా ఇతర తారాగణమంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు.  వ్యవసాయం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో శర్వానంద్‌ రైతుగా కనిపిస్తారు. కిశోర్‌ బి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యువరాజ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సాయిమాధవ్‌ బుర్రా మాటలందిస్తున్నారు. 


Updated Date - 2020-10-27T17:54:39+05:30 IST