`శ్రీకారం` అస‌లు క‌థ ఇదే

ABN , First Publish Date - 2020-02-08T19:18:59+05:30 IST

రైతు త‌న కొడుకు రైతు కావాల‌నుకోవ‌డం లేద‌నేది స‌త్యం. అయితే అలా ఎందుకు కాకూడ‌దు? అనే పాయింట్‌పై తెర‌కెక్కుతోన్న చిత్రం `శ్రీకారం`.

`శ్రీకారం` అస‌లు క‌థ ఇదే

రైతు దేశానికి వెన్నెముక అని మ‌నం పుస్త‌కాల్లో చ‌దువుకున్నాం. కానీ నేడు ఆ రైతు వెన్నెముక లేకుండా పోయాడు. ప్ర‌భుత్వాలు రైతు గురించి ప‌ట్టించుకోవు.. ప్ర‌జ‌ల‌కేమో తీరిక ఉండ‌దు. ఆక‌లేస్తే మ‌నం తినే ఆహారాన్ని మాత్రం పండించేది రైతు అన్న సంగ‌తినే మ‌ర‌చిపోయాం. ఇన్ని క‌ష్టాల న‌డుమ రైతులు వారి వృత్తిని కొన‌సాగించాల‌నుకోవ‌డం లేదు. రైతు త‌న కొడుకు రైతు కావాల‌నుకోవ‌డం లేద‌నేది స‌త్యం. అయితే అలా ఎందుకు కాకూడ‌దు? అనే పాయింట్‌పై తెర‌కెక్కుతోన్న చిత్రం `శ్రీకారం`. శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్నాడు. రైతు అయిన హీరో తండ్రి కొడుకుని పెద్ద చ‌దువులు చ‌దివిస్తాడు. పెద్ద ఉద్యోగం చేస్తాడ‌నుకుంటే హీరో ఏమో రైతు అవుతానంటాడు. అప్పుడు ఆ తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు? త‌ండ్రీ కొడుకుల మ‌ధ్య ఎలాంటి సంఘ‌ర్ష‌ణ జ‌రుగుతుంది? అనే కాన్సెప్ట్‌తో `శ్రీకారం` సినిమా ప్రేక్ష‌కుల ముందుకు ఏప్రిల్ 24న  రానుంది. 

Updated Date - 2020-02-08T19:18:59+05:30 IST