శ్రద్ధా శ్రీనాథ్‌ ‘కలియుగం’

ABN , First Publish Date - 2020-11-06T17:33:50+05:30 IST

మహాప్రళయం తర్వాత ఈ భూలోకం ఏ విధంగా ఉంటుందన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘కలియుగం’. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధాశ్రీనాథ్‌ నటించనున్నారు

శ్రద్ధా శ్రీనాథ్‌ ‘కలియుగం’

మహాప్రళయం తర్వాత ఈ భూలోకం ఏ విధంగా ఉంటుందన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘కలియుగం’. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధాశ్రీనాథ్‌ నటించనున్నారు. ఈ కథ చెప్పగానే నటించేందుకు శ్రద్ధా శ్రీనాధ్‌ అంగీకరించినట్లు దర్శకుడు ప్రమోద్‌ సుందర్‌ తెలిపారు. గతంలో పలు లఘుచిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రమోద్‌ సుందర్‌ ఈ హర్రర్‌, థ్రిల్లర్‌ చిత్రం కోసం చక్కని కథను రూపొందించారు. ఆర్కే ఇంటర్నేషనల్‌ తరఫున ప్రైమ్‌ సినిమాస్‌ సంస్థ అధినేత కేఎస్‌. రామకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో వచ్చే యేడాది జనవరి నుండి ప్రారంభమవుతోంది. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు వింత అనుభూతి కలిగిస్తుందని దర్శకుడు ప్రమోద్‌ సుందర్‌ తెలిపారు.

Updated Date - 2020-11-06T17:33:50+05:30 IST