బిగ్‌బాస్4... కేసు వేస్తాను: శ్రద్ధాదాస్

ABN , First Publish Date - 2020-07-28T13:47:24+05:30 IST

హీరోయిన్ శ్ర‌ద్ధాదాస్ బిగ్‌బాస్ 4 కార‌ణంగా తాను కోర్టుకు వెళ‌తాన‌ని అంటున్నారు

బిగ్‌బాస్4... కేసు వేస్తాను:  శ్రద్ధాదాస్

హీరోయిన్ శ్ర‌ద్ధాదాస్ బిగ్‌బాస్ 4 కార‌ణంగా తాను కోర్టుకు వెళ‌తాన‌ని అంటున్నారు. ఇంత‌కూ బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు, శ్ర‌ద్ధాదాస్‌కు ఏమైనా గొడ‌వా? అంటే అదీ కాదు. అస‌లు విష‌య‌మేమంటే.. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్ వీరే అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్ట‌డం ప్రారంభ‌మైయాయి. ఇందులో శ్ర‌ద్ధాదాస్ పాల్గొంటారు అంటూ వార్త‌లు వినిపించాయి. ఆమె ఆ వార్త‌లన‌ ఖండించినా ఆగ‌లేదు. దీంతో శ్ర‌ద్ధాదాస్ ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. 


‘‘బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో కోసం నన్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను చూసి చాలా మంది నన్ను అడుగుతున్నారు. జ‌ర్న‌లిస్టులు ఇలాంటి వార్త‌లు రాసేముందు క్లారిటీ తీసుకుంటే బావుంటుంది. త‌ప్పుడు వార్త‌లు రాసేవారికి ఇదే నా మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక‌. అస‌త్య‌పు వార్త‌లు రాసే వాళ్లు ఇలాగే చేస్తే వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకోడానికి వెనుకాడబోను’’ అన్నారు శ్ర‌ద్ధాదాస్‌. మ‌రిప్పుడైనా శ్ర‌ద్ధాపై అస‌త్య‌పు వార్త‌లు ఆగుతాయేమో చూడాలి. 



Updated Date - 2020-07-28T13:47:24+05:30 IST