‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ నుంచి చుక్కల చున్ని సాంగొచ్చింది
ABN , First Publish Date - 2020-11-06T00:34:24+05:30 IST
'అల వైకుంఠపురములో' చిత్రంలోని రాములో రాములా సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెసలిందే. ఈ సాంగ్‌ని పాడింది అనురాగ్

'అల వైకుంఠపురములో' చిత్రంలోని రాములో రాములా సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెసలిందే. ఈ సాంగ్‌ని పాడింది అనురాగ్ కులకర్ణి. ఇప్పుడు ఆయన పాడిన మరో చిత్రంలోని సాంగ్ తాజాగా విడుదలైంది. మొదటి చిత్రం 'రాజావారు రాణిగారు' చిత్రంతో మంచి గుర్తింపును పొందిన కిరణ్ అబ్బవరం హీరోగా, 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్‌గా శ్రీధర్ గాదే దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎస్.ఆర్. కళ్యాణమండపం'. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని అనురాగ్ కులకర్ణి ఆలపించిన చుక్కల చిన్ని అనే లిరికల్ సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాతలు ప్రమోద్, రాజు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాట విడుదల సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ''కిరణ్ అబ్బవరం మొదటి చిత్రం రాజావారు రాణి గారు మాకు చాలా బాగా నచ్చింది. ఈ లాక్‌డౌన్‌లో అమెజాన్ ప్రైమ్‌లో మోస్ట్ వ్యూవర్‌షిప్ వున్న టాప్ 5 చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఉందంటే.. మా హీరో కిరణ్ ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాడో తెలుస్తోంది. కిరణ్ రెండవ చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం మేము చేయటం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే ఫస్ట్ సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెండవ సాంగ్ చుక్కల చున్నిని విడుదల చేశాము. ఇన్‌స్టెంట్ హిట్‌గా ఈ సాంగ్ దూసుకెళుతోంది. ఈ చిత్రంలో హీరో కిరణ్, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ లు మధ్య వచ్చే రొమాంటిక్ చిలిపి సన్నివేశాలు యూత్ ని ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్ చూసిన వారంతా అదే చెప్తున్నారు. అలాగే కిరణ్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్ గా కనిపించాయని అందరూ అంటున్నారు. అనురాగ్ కులకర్ణి అద్భుతమైన వాయిస్‌కి చైతన్ భరద్వాజ్ సంగీతం తోడవడంతో.. పాట ఓ లెవల్‌లో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తాము.." అని తెలియజేశారు.