‘ఏటో వెళ్లి డైరీస్‌’ అంటూ.. నాగ్‌కి స్పెషల్‌ గిప్ట్

ABN , First Publish Date - 2020-10-05T01:50:04+05:30 IST

కింగ్‌ నాగార్జున నటించిన చిత్రాలలో 'నిన్నేపెళ్లాడతా' చిత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే

‘ఏటో వెళ్లి డైరీస్‌’ అంటూ.. నాగ్‌కి స్పెషల్‌ గిప్ట్

కింగ్‌ నాగార్జున నటించిన చిత్రాలలో 'నిన్నేపెళ్లాడతా' చిత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా 'ఏటో వెళ్లిపోయింది మనసు' అని పాడుకోని లవర్‌ ఉండడంటే.. అతిశయోక్తి కాదు. అంతలా ఆ పాట క్రేజుని సంపాదించుకుంది. ఈ చిత్రం 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కింగ్‌ నాగార్జునకు సంగీత దర్శకుడు సందీప్ చౌతా ఓ మ్యూజికల్‌ గిప్ట్‌ను పంపారు. 'ఏటో వెళ్లి డైరీస్‌' అంటూ సంగీత దర్శకుడు సందీప్‌ చౌతా తనకు అద్భుతమైన గిప్ట్ పంపినట్లుగా తెలుపుతూ.. ట్విట్టర్‌ ద్వారా నాగ్‌ ఆయనని అభినందించి ధన్యవాదాలు తెలిపారు. తన మ్యూజిక్‌ గిఫ్ట్‌కి వర్క్‌ చేసిన సందీప్‌ చౌతా మ్యూజిక్‌ టీమ్‌లోని ప్రతి ఒక్కరి పేరు చెబుతూ నాగ్‌ వారికి అభినందనలు తెలిపారు. 


నాగ్‌ ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేసిన అఖిల్‌ అక్కినేని.. "అద్బుతమైన ఆల్బమ్‌ మరియు అద్బుతమైన సంగీత దర్శకుడు.. టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు" అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-10-05T01:50:04+05:30 IST

Read more