మా మధ్య విభేదాలు సృష్టించవద్దు : ఎస్‌.పి. చరణ్‌

ABN , First Publish Date - 2020-09-29T01:23:01+05:30 IST

గాన గంధర్వుడు ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం హాస్పిటల్‌ బిల్స్‌పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకు ఆయన కుమారుడు ఎస్‌.పి. చరణ్

మా మధ్య విభేదాలు సృష్టించవద్దు : ఎస్‌.పి. చరణ్‌

గాన గంధర్వుడు ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం హాస్పిటల్‌ బిల్స్‌పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకు ఆయన కుమారుడు ఎస్‌.పి. చరణ్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆదివారం సోషల్ మీడియా ద్వారా రూమర్లను క్రియేట్‌ చేస్తున్న వారిపై ఫైర్‌ అయిన ఆయన.. మరోసారి అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించి.. ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. త్వరలోనే తన తండ్రి  వైద్య చికిత్సకు సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్‌ బిల్లులను తెలియజేస్తానని, అందరి సందేహాలు తీరుస్తానని ఆయన తెలియజేశారు.


అలాగే బిల్లుల విషయంలో ఢిల్లీ పెద్దలు ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు వినిపిస్తున్న తరుణంలో.. అలాంటి ఊహాగానాలు మానుకోవాలని కోరారు. బ్యాలెన్స్ బిల్‌ పే చేస్తేనే తన తండ్రి భౌతికకాయాన్ని ఇస్తామని హాస్పిటల్‌ సిబ్బంది చెప్పినట్లుగా వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతివారం బిల్స్ పే చేస్తూనే వచ్చామని, ఆఖరికి బాలు మృతి తర్వాత కూడా బిల్‌ గురించి అడిగితే.. ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడమని చెప్పి.. హాస్పిటిల్‌ యాజమాన్యం తమకు ఎంతో గౌరవం ఇచ్చినట్లుగా చరణ్ తెలిపారు. మొదటి నుంచి ఎంజీఎం హాస్పిటల్‌ తమకు ఎంతగానో సహకరించిందని, దయచేసి మా రిలేషన్‌ మధ్య విభేదాలు సృష్టించవద్దని ఆయన కోరారు. Updated Date - 2020-09-29T01:23:01+05:30 IST