ఎస్.పి. బాలు హెల్త్ అప్‌డేట్: గుడ్ న్యూస్
ABN , First Publish Date - 2020-08-25T22:46:25+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా గాన గంధర్వుడు ఎస్.పి. బాలు కోసం చేసిన పూజలు ఫలించాయి. ఎస్. పి. బాలు కోలుకుంటున్నారు. ఈ విషయం స్వయంగా ఆయన తనయుడు

ప్రపంచవ్యాప్తంగా గాన గంధర్వుడు ఎస్.పి. బాలు కోసం చేసిన పూజలు ఫలించాయి. ఎస్. పి. బాలు కోలుకుంటున్నారు. ఈ విషయం స్వయంగా ఆయన తనయుడు చరణ్ తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఎస్.పి. బాలు హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి రోజూ ఆరోగ్యపరిస్థితిని చెబుతూ.. ఎస్.పి. చరణ్ వీడియోను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోలో.. తన తండ్రి కోలుకుంటున్నారని, డాక్టర్స్‌కు, వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. నిజంగా ఇది బాలూ అభిమానులకు గుడ్ న్యూసే.
ఎందుకంటే.. ప్రతి రోజూ ఎస్.పి. బాలు విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అందరూ భయపడిపోతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత ప్రపంచం చేయని పూజలు లేవు. ఇప్పుడా పూజలన్ని ఫలించి.. ఆయన రికవరీ అవుతున్నట్లుగా చరణ్ పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్య పరిస్థితి నార్మల్‌గా ఉంది. 90 శాతం ఐసోలేషన్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. డాక్టర్స్‌కు అలాగే వైద్యానికి స్పందిస్తున్నారు. నాన్నగారి కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎంజీఎం హెల్త్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు. అలాగే నాన్నగారి కోసం ఎంతో శ్రమించిన, శ్రమిస్తున్న డాక్టర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు...’’ అని చరణ్ ఈ వీడియోలో తెలిపారు.