బాలు ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్!

ABN , First Publish Date - 2020-08-27T00:42:13+05:30 IST

కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త మెరుగైంది.

బాలు ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్!

కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్‌ వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. చికిత్సకు బాలు బాగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. 


బాలు స్పృహలోకి వచ్చారని, ఆయన శ్వాస ప్రక్రియ బాగా మెరుగైందని వెల్లడించారు. ఇలాగే నిలకడగా ఉంటే మరో వారం రోజుల్లో ఎక్మో పరికరాన్ని తొలగించే వీలుందని తెలిపారు. ఇక, బాలు చికిత్స పొందుతున్న అత్యవసర విభాగం దిగువ అంతస్థులో ప్రతి రోజూ వేద పండితులు వేదపారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని బాలు చికిత్స పొందుతున్న గదిలో ఉన్న టీవీ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 

Updated Date - 2020-08-27T00:42:13+05:30 IST