ఎస్పీబీకి క‌రోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-05T18:24:46+05:30 IST

గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా టెస్టుల్లోపాజిటివ్‌గా అని నిర్ధార‌ణ అయ్యింది.

ఎస్పీబీకి క‌రోనా పాజిటివ్‌

గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా టెస్టుల్లోపాజిటివ్‌గా అని నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు. జ్వ‌రంతో ఇబ్బంది ప‌డుతున్న త‌ను క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని డాక్ట‌ర్స్ చెప్పిన‌ట్లు ఆయ‌న ఆ వీడియోలో తెలిపారు. ప్ర‌స్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. త‌న ఆరోగ్యం ఎవ‌రూ భ‌య‌ప‌డ‌న‌క్క‌ర్లేద‌ని ఆయ‌న స‌ద‌రు వీడియో ద్వారా తెలియ‌జేశారు. తనకు ఎవరూ పోన్లు చేయవద్దని, డాక్టర్స్ రెస్ట్ అవసరమని సూచించినట్లు ఎస్పీబీ తెలిపారు. 


Updated Date - 2020-08-05T18:24:46+05:30 IST