సోనూసూద్‌కు సెటో ్లసన్మానం!

ABN , First Publish Date - 2020-09-29T06:55:43+05:30 IST

లాక్‌డౌన్‌లో ఎంతోమంది పేదలకు, వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూసూద్‌ షూటింగ్‌కి సై అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా, తను కీలక పాత్ర పోషిస్తున్న ‘అల్లుడు అదుర్స్‌’ సెట్‌లో...

సోనూసూద్‌కు సెటో ్లసన్మానం!

లాక్‌డౌన్‌లో ఎంతోమంది పేదలకు, వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూసూద్‌ షూటింగ్‌కి సై అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా, తను కీలక పాత్ర పోషిస్తున్న ‘అల్లుడు అదుర్స్‌’ సెట్‌లో సోనూ అడుగుపెట్టారు. ఈ సందర్భంలో లాక్‌డౌన్‌లో కష్టంలో ఉన్నవారిని ఆదుకున్న ఆయనను ప్రకాశ్‌రాజ్‌ చిత్ర బృందం సమక్షంలో సన్మానించారు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. హీరో సాయిశ్రీనివాస్‌, ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌, నభా నటేష్‌, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, సత్య, కాదంబరి కిరణ్‌, చమ్మక్‌ చంద్ర, దువ్వాసి మోహన్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘కుటుంబ కథాంశంతో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల చివరి షెడ్యూల్‌ మొదలుపెట్టాం. సినిమాకు టైటిల్‌కూ, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కూ స్పందన బావుంది. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం. సంక్రాంతి పండుగకు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత సుబ్రహ్మణ్యం గొర్రెల చెప్పారు. నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: చోటా కె. నాయుడు. 

Updated Date - 2020-09-29T06:55:43+05:30 IST