చంద్రబాబు అభినందనకు సోనూసూద్ స్పందన ఇదే..

ABN , First Publish Date - 2020-07-27T04:09:27+05:30 IST

సినీ నటుడు సోనూ‌సూద్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అభినందించినట్లుగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్రాజపల్లిలో

చంద్రబాబు అభినందనకు సోనూసూద్ స్పందన ఇదే..

సినీ నటుడు సోనూ‌సూద్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అభినందించినట్లుగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్రాజపల్లిలో కాడెద్దులుగా మారి కుమార్తెలే తండ్రికి పొలం పనుల్లో సాయపడటంపై సోనూసూద్ స్పందించి ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడాన్ని చంద్రబాబు అభినందించారు. సోనూసూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించడంతో పాటు ఇక దళిత రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. చంద్రబాబు ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన సోనూసూద్.. మీరు మాకు స్ఫూర్తి అంటూ తెలిపారు. త్వరలోనే మిమ్మల్ని కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. 


‘‘మీ అభినందనలకు కృతజ్ఞతలు. మీలాంటి దయాహృదయం కలిగిన వారిచ్చే స్ఫూర్తితో.. పేదవారికి సహాయం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు వస్తారు. మీ మార్గదర్శకత్వంలో లక్షలాది మంది వారి కలలను సాకారం చేసుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు. మీరిలా స్ఫూర్తినింపుతూనే ఉండాలి సార్. త్వరలో మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను..’’ అని సోనూసూద్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Updated Date - 2020-07-27T04:09:27+05:30 IST

Read more