విమర్శలకు చెక్ పెట్టిన సోనూసూద్!

ABN , First Publish Date - 2020-06-08T18:44:21+05:30 IST

లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి నిజమైన హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూసూద్

విమర్శలకు చెక్ పెట్టిన సోనూసూద్!

లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి నిజమైన హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూసూద్ ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. సోనూసూద్ మంచి మనసును ఉద్ధవ్ ప్రశంసించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం చేయాల్సిన పనుల గురించి సోనూతో చర్చించారు. ఆ విషయాన్ని ఆదిత్య ఠాక్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో సోనూపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన విమర్శలకు చెక్ పడినట్టైంది. 


సోనూసూద్ చేస్తున్న సహాయంపై సంజయ్ రౌత్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. శివసేన అధికార పత్రిక `సామ్నా` వేదికగా సోనూసూద్‌పై విరుచుకుపడ్డారు. స్వీయ ఆర్థిక ప్రయోజనాల కోసమే సోనూసూద్ ఇదంతా చేస్తున్నారని, బీజేపీకి కొమ్ము కాస్తూ చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విమర్శలు కలకలం రేపాయి. ఈ వివాదం మరింత ముదరకూడదనే ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర సీఎంను సోనూసూద్ కలిశారు. తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టారు.  
Updated Date - 2020-06-08T18:44:21+05:30 IST