నెటిజెన్‌కు సోనూసూద్ అదిరిపోయే రిప్లై

ABN , First Publish Date - 2020-05-26T23:14:17+05:30 IST

ఇప్పటి వరకు 1200 వాహనాల్లో సుమారు 20 వేల మందికి పైగానే వలస కార్మికులను సొంతూళ్లను పంపినట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా ద్వారా వచ్చే అభ్యర్థనలకు కూడా ఆయన స్పందిస్తున్నారు

నెటిజెన్‌కు సోనూసూద్ అదిరిపోయే రిప్లై

ముంబై: లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రదేశాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులను సొంతూళ్లకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 1200 వాహనాల్లో సుమారు 20 వేల మందికి పైగానే వలస కార్మికులను సొంతూళ్లను పంపినట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా ద్వారా వచ్చే అభ్యర్థనలకు కూడా ఆయన స్పందిస్తున్నారు. కష్టాల్లో ఉన్నామని చెబుతున్న వారికి సహాయం చేస్తూనే వారిని మానసికంగా బలోపేతం చేస్తున్నారు. నెటింట్లో సోనూ సూద్ ఇస్తున్న ప్రతిస్పందనలు నెటిజెన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నిన్ననే ఓ వ్యక్తి తనను మద్యం షాపు వద్దకు తీసుకెళ్లమంటూ అభ్యర్థిస్తే.. ‘‘వెళ్లేప్పుడు కాదు, మద్యం షాపు నుంచి ఇంటికి వచ్చేప్పుడు కావాలంటే అడుగు సాయం చేస్తాను’’ అంటూ సమాధానం చెప్పాడు.


ఇక ఈరోజు మరో వ్యక్తి సోనూను కొంటెగా ఓ అభ్యర్థన చేశాడు. దానికి సోనూసూద్ ఇచ్చిన రిప్లై కూడా నెటిజెన్లకు తెగ నచ్చింది. దీంతో ఆ ట్వీట్‌పై లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశ్వజిత్ ద్వివేది అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ‘‘సోనూసూద్ భయ్యా.. ఒకసారి నా గర్ల్‌ఫ్రెండ్‌ను కల్పించవా.. ఆమె బిహార్‌లో ఉంది’’ అని ట్వీట్ చేశాడు. ఇందులో సోనూసూద్‌ను ట్యాగ్ చేయడంతో పాటు, హ్యాష్‌ట్యాగ్ కూడా ఉపయోగించాడు. దీనికి స్పందించిన సోనూసూద్ ‘‘కొద్ది రోజులు దూరంగా ఉండు భయ్యా. నిజమైన పరీక్ష కూడా జరిగిపోతుంది’’ అని రాసుకొచ్చాడు. సోనూ రిప్లై నచ్చిన నెటిజెన్లు.. అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Updated Date - 2020-05-26T23:14:17+05:30 IST