సోనూసూద్‌ ఆత్మకథ

ABN , First Publish Date - 2020-11-13T10:47:56+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్న ఎందరో వలస కూలీలను సురక్షితంగా వారి సొంత ఊరికి చేర్చడానికి పెద్ద మనసుతో సాయం...

సోనూసూద్‌ ఆత్మకథ

లాక్‌డౌన్‌ సమయంలో  ఇబ్బందులు పడుతున్న ఎందరో వలస కూలీలను సురక్షితంగా వారి సొంత ఊరికి చేర్చడానికి పెద్ద మనసుతో సాయం చేశారు సోనూసూద్‌. నిస్వార్ధంగా ఆయన చేసిన సాయం కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ‘వలస కూలీల పాలిట మెస్సయ్య’గా ఆయన్ను ప్రజలు అభివర్ణించారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎదుర్కొన్న సంఘటనలు, అనుభవాలతో ‘ఐ యామ్‌ నో మెస్సయ్య’ పేరుతో సోనూసూద్‌ ఆత్మకథను పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ సంస్థ ప్రచురిస్తోంది. దీనికి మీనా అయ్యర్‌ సహ రచయిత్రి. వలస కూలీలను కాపాడి వారిని సొంతూళ్లకు చేర్చడంలో ఎదురైన సవాళ్లు, భావోద్వేగానికి గురి చేసిన సంఘటనలను  సోనూసూద్‌ ఈ పుస్తక ంలో వివరించారు. లాక్‌డౌన్‌ కాలంలో తను విన్నవి, తనకు తారస పడిన సంఘటనలు తన జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చాయో, జీవితంపై తన దృక్పథాన్ని ఎలా మార్చాయో ఈ పుస్తకం ద్వారా సోనూసూద్‌ అభిమానులతో పంచుకుంటున్నారు.

Updated Date - 2020-11-13T10:47:56+05:30 IST