20 వేల మందికి సోనూ సాయం
ABN , First Publish Date - 2020-08-25T18:42:31+05:30 IST
కరోనా లాక్‌డౌన్ సమయంలో బాలీవుడ్ స్టార్ సోనూసూద్ వలస కార్మికుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరో 20 వేల మందికి నోయిడాలో ఆశ్రయం కల్పించారు సోనూ.

కరోనా లాక్‌డౌన్ సమయంలో బాలీవుడ్ స్టార్ సోనూసూద్ వలస కార్మికుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. వలస కార్మికులు వారి స్వస్థలాలను చేరుకునేందుకు రైళ్లు, బస్సులు, విమానాలను ఏర్పాటు చేసిన సోనూసూద్.. వారి కోసం ఇంకా సాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో 20 వేల మందికి నోయిడాలో ఆశ్రయం కల్పించారు సోనూ. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ‘‘ఇరవై వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలను కల్పిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రవాసీ రోజ్‌గార్ ద్వారా ఈ పనిని పూర్తి చేయడానికి అందరం కష్టపడ్డాం. ఎన్ఏఈసీ అధ్యక్షకుడు లలిత్ టుక్రాల్ ఎంతగానో సాయపడ్డారు’’ అని తెలిపారు సోనూసూద్.
Read more