సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఏదో ఒక రోజు మీరు చేరుకుంటారు: పాత ఫొటో షేర్ చేసిన సోనూ సూద్

ABN, First Publish Date - 2020-10-05T18:36:25+05:30

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `మణికర్ణిక` చిత్రం అప్పట్లో ఎన్నో వివాదాలకు కారణమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `మణికర్ణిక` చిత్రం అప్పట్లో ఎన్నో వివాదాలకు కారణమైంది. దర్శకుడు క్రిష్ సినిమా మధ్యలోనే తప్పుకోవడం, ఆ వెంటనే ప్రముఖ నటుడు సోనూ సూద్ కూడా చిత్రం నుంచి బయటకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. 


ఆ సినిమా సెట్‌లో దర్శకుడు క్రిష్‌తో తీసుకున్న ఫొటోను తాజాగా సోనూ సూద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. `జీవితంలో మంచి కోసం నడవండి.. ఏదో ఒక రోజు మీరు చేరుకుంటార`ని సోనూ కామెంట్ చేశాడు. `మణికర్ణిక` సినిమాలో సోనూ సూద్ పాత్ర ప్రాధాన్యం తగ్గించాలని, స్క్రిప్టులో పలు మార్పుల చేయాలని కంగన పట్టుబట్టడంతోనే దర్శకుడు క్రిష్ తప్పుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. కంగన డామినేషన్ తట్టుకోలేక ఆ తర్వాత సోనూ కూడా బయటకు వచ్చేశాడని వార్తలు వచ్చాయి.  

 



Updated Date - 2020-10-05T18:36:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!