రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు: సోనూసూద్

ABN , First Publish Date - 2020-09-29T14:20:24+05:30 IST

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా కాలంలో చితికిపోయిన బతుకులకు ఆసరా అందిస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు...

రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు: సోనూసూద్

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా కాలంలో చితికిపోయిన బతుకులకు ఆసరా అందిస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కూడా సోనూసూద్ పేదలకు సాయం అందిస్తూ వస్తున్నారు. రాజకీయాయ ప్రవేశం గురించి సోనూసూద్‌ను మీడియా అడగగా తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలేచనేదీ లేదని అన్నారు. ‘ఒక యాక్టర్‌గా నా చేతిలో చాలా పనులున్నాయి. దీనికితోడు నేను ఎన్నో చారిటీ పనులు చేస్తున్నాను. వీటిపైనే దృష్టి పెట్టేందుకు సమయం సరిపోతోంది. 



అందుకే ఇప్పట్లో రాజకీయాల గురించి ఆలోచించేందుకు చోటులేదు. పైగా రాజకీయాల గురించి నాకు ఏమాత్రం తెలియదు. అయితే పదేళ్ల తరువాత నేను ఏం చేస్తానో, నా నుదిటి మీద ఏమి రాసి ఉందో నాకేమి తెలుసు? నేను చాలా ముందుకు వెళ్లాల్సివుంది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏ పార్టీవారినో అడిగి చేయడం లేదు. నా ఇష్టాపూర్వకంగానే చేస్తున్నానని‘ సోనూసూద్ తెలిపారు. 

Updated Date - 2020-09-29T14:20:24+05:30 IST