మరోసారి ఉదారత చాటిన సోనూసూద్.. ఈసారి ఏకంగా..?

ABN , First Publish Date - 2020-10-05T02:36:27+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి బాధితులు, పేదలకు సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్న

మరోసారి ఉదారత చాటిన సోనూసూద్.. ఈసారి ఏకంగా..?

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి బాధితులు, పేదలకు సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్న నటుడు సోనూసూద్‌ మరోసారి తన ఉదారతను ప్రదర్శించారు. హర్యానాలోని మొర్ని గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఆన్ లైన్ క్లాసెస్ కోసం మొబైల్ ఉపయోగించాల్సి వచ్చింది. అయితే ఆ గ్రామంలో మొబైల్ నెట్వర్క్ లేనందున ఆ అబ్బాయి చెట్టు పైకి ఎక్కి ఆన్ లైన్ క్లాసెస్ వింటున్నాడు. చెట్టు ఎక్కితేనే గానీ నెట్ వర్క్ రాని పరిస్థితి.


అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ అబ్బాయి గురించి ట్విట్టర్ ద్వారా సోనూసూద్‌కు తెలిసింది. విషయం తెలుసుకున్న సోనూసూద్ వెంటనే ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఎయిర్ టెల్ టవర్‌ను అక్కడ స్థాపించారు. ఇప్పుడు ఆ గ్రామంలో నెట్ వర్క్ సమస్య లేదు. స్టూడెంట్స్ కోసం సోనుసూద్ చేసిన ఈ పనికి ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.Updated Date - 2020-10-05T02:36:27+05:30 IST

Read more