లాంఛనంగా ప్రారంభమైన 'సన్నాఫ్‌ ఇండియా'

ABN , First Publish Date - 2020-10-23T19:11:25+05:30 IST

కోవిడ్‌ నేపథ్యంలో ఆగిన సినిమా షూటింగ్స్‌ క్రమంగా మొదలవుతున్నాయి. తాజాగా కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తన కొత్త చిత్రం 'సన్నాఫ్‌ ఇండియా'ను లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

లాంఛనంగా ప్రారంభమైన 'సన్నాఫ్‌ ఇండియా'

కోవిడ్‌ నేపథ్యంలో ఆగిన సినిమా షూటింగ్స్‌ క్రమంగా మొదలవుతున్నాయి. తాజాగా కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తన కొత్త చిత్రం 'సన్నాఫ్‌ ఇండియా'ను లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ చాలా ఎగ్జయిటింగ్ గా ఉందని తెలిపారు. శ్రీలక్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై సినిమా రూపొందుతోంది. ముహూర్తపు సన్నివేశంపై లక్ష్మీమంచు, నిర్వాణ క్లాప్‌కొట్టగా, విరానిక, ఐరా, అవ్‌రాజ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. మంచు విష్ణు గౌరవ దర్శకత్వం వహించారు. డైమండ్‌ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 560కి పైగా చిత్రాల్లో పలు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన మోహన్‌బాబు 'సన్నాఫ్‌ ఇండియా' వంటి దేశభక్తి ప్రధానంగా రూపొందుతోన్న చిత్రంలో ఏ అంశాన్ని టచ్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించనున్నారు. 


Updated Date - 2020-10-23T19:11:25+05:30 IST

Read more