నయనతార, త్రిషనెందుకు నిర్మాతలు అలా అడగరు: సోనియా అగర్వాల్‌

ABN , First Publish Date - 2020-10-05T16:21:34+05:30 IST

తనకింకా అమ్మగా నటించే వయసు రాలేదని చెబుతోందో హీరోయిన్‌. ఇంతకూ ఆ హీరోయిన్‌ ఎవరో కాదు సోనియా అగర్వాల్‌.

నయనతార, త్రిషనెందుకు నిర్మాతలు అలా అడగరు: సోనియా అగర్వాల్‌

తనకింకా అమ్మగా నటించే వయసు రాలేదని చెబుతోందో హీరోయిన్‌. ఇంతకూ ఆ హీరోయిన్‌ ఎవరో కాదు సోనియా అగర్వాల్‌. ఈమె 'కాదల్‌కొండేన్‌, 7జీ రెయిన్‌బో కాలనీ' తదితర చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే తాను ఇప్పట్లో అమ్మ పాత్రల్లో నటించనని చెబుతోంది. ప్రస్తుతం కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ త్రిష, నయనతార తాను ఒకే సమయంలో చిత్రసీమలో ప్రవేశించామని, అలాంటప్పుడు తనను మాత్రం అమ్మ పాత్రల్లో నటించమని దర్శక నిర్మాతలు అడుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. ఈ నిర్మాతలు, దర్శకులు త్రిష, నయనతారలను కూడా అమ్మ పాత్రల్లో నటించమని ఎందుకు అడగటం లేదని ప్రశ్నిస్తోంది. తానింగా అందంగానే, హీరోయిన్‌గా నటించేందుకు తగిన ఫిట్‌నెస్‌తోనే ఉన్నానని, అలాంటప్పుడు తనను అమ్మ పాత్రలో నటించమని అడగటం న్యాయమేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాధిక, ఖుష్బూలా తనకు వయస్సు పెరిగిన తర్వాత అమ్మ పాత్రల్లో నటిస్తానని, ప్రస్తుతం అమ్మ పాత్రలలో నటించే వయస్సు రాలేదని సోనియా అగర్వాల్‌ చెబుతోంది.


Updated Date - 2020-10-05T16:21:34+05:30 IST

Read more