`ఏంది.. ముద్దు పెడితే ఏడుస్తారా!`

ABN , First Publish Date - 2020-02-14T17:39:59+05:30 IST

క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న తాజా చిత్రం `లవ్‌స్టోరి`.

`ఏంది.. ముద్దు పెడితే ఏడుస్తారా!`

క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న తాజా చిత్రం `లవ్‌స్టోరి`.  ఎమిగోస్‌ క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు (శుక్రవారం) ఈ సినిమాలోని `ఏయ్‌ పిల్లా..’ అంటూ సాగే పాట ప్రివ్యూను చిత్రబృందం విడుదల చేసింది. 


పాట, చిత్రీకరణ శేఖర్ కమ్ముల తరహాలో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కొన్ని సీన్లను ఈ సాంగ్ ప్రివ్యూలో చూపెట్టారు. నాగచైతన్యకు ట్రైన్‌లో ముద్దు పెట్టిన అనంతరం `ఏంది.. ముద్దు పెడితే ఏడుస్తారబ్బా` అని సాయిపల్లవి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఏఆర్ రెహ్మాన్ వద్ద పనిచేసిన సీహెచ్ పవన్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 

Updated Date - 2020-02-14T17:39:59+05:30 IST