రానాకు స్వాగతం పలికిన సోనమ్ కపూర్!

ABN , First Publish Date - 2020-05-13T22:16:23+05:30 IST

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

రానాకు స్వాగతం పలికిన సోనమ్ కపూర్!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రేమకు మిహిక బజాజ్‌ ఓకే చెప్పిందంటూ ఆమెతో కలిసి ఉన్న ఫొటోను రానా సోషల్ మీడియాలో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ రానాకు, మిహికకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానా ప్రకటన చేసిన వెంటనే మిహిక గురించి ఇంటర్నెట్‌లో ఆరా తీయడం ప్రారంభమైంది. 


మిహిక ఒక ఇంటీరియర్ డిజైనర్ అని, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి డ్యూ డ్రాప్‌ పేరిట ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నిర్వహిస్తోందని వివరాలు బయటపడ్డాయి. అలాగే బాలీవుడ్‌లోని అనిల్ కపూర్ కుటుంబానికి ఈమె కుటుంబం చాలా క్లోజ్ అని కూడా సమాచారం బయటకు వచ్చింది. సోనమ్, మిహిక మంచి స్నేహితులని తెలుస్తోంది. సోనమ్ పెళ్లిలో మిహిక సందడి చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమ కుటుంబంలోకి రానాకు స్వాగతం పలుకుతూ సోనమ్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. `నీకు శుభాకాంక్షలు డార్లింగ్ మిహిక. లవ్‌ యూ. అత్యుత్తమైనవి పొందే అర్హత నీకుంది. రానా నిన్ను మరింత సంతోషంగా ఉంచుతాడు. మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా` అంటూ సోనమ్ పేర్కొంది. 

Updated Date - 2020-05-13T22:16:23+05:30 IST