హీరోతో డేటింగ్.. సొనాక్షి స్పందన!

ABN , First Publish Date - 2020-05-25T19:56:55+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్‌తో హీరోయిన్ సొనాక్షి సిన్హా ప్రేమలో ఉందని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

హీరోతో డేటింగ్.. సొనాక్షి స్పందన!

బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్‌తో హీరోయిన్ సొనాక్షి సిన్హా ప్రేమలో ఉందని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2013లో ప్రభుదేవా దర్శకత్వం వహించిన `ఆర్.. రాజ్‌కుమార్` సినిమాలో షాహిద్, సొనాక్షి కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే 2015లో షాహిద్.. మీరా రాజ్‌పుత్‌ని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ డేటింగ్ వార్తలకు చెక్ పడింది. 


ఆ డేటింగ్ వార్తల గురించి తాజాగా సొనాక్షి స్పందించింది. షాహిద్‌తో డేటింగ్ నిజం కాదని, అతను తనకు మంచి స్నేహితుడని సొనాక్షి చెప్పింది. `ఖాళీగా ఉండే కొందరు వ్యక్తులు ఇలాంటి రూమర్లను కావాలని సృష్టిస్తారేమో. వాటిని అందరూ చాలా తొందరగా నమ్మేస్తారు. పెళ్లి కాని ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నప్పుడు వారిని టార్గెట్ చేసుకుని ఇలాంటి రూమర్లు అల్లేస్తారు. ఇలాంటివి నన్నెప్పుడూ బాధించలేదు. ఆ వార్తలు చూసి నేను, షాహిద్ నవ్వుకునే వాళ్లం. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమేన`ని సొనాక్షి చెప్పింది. 

Updated Date - 2020-05-25T19:56:55+05:30 IST

Read more