సోనాక్షి చిత్రలేఖ‌నం

ABN , First Publish Date - 2020-04-28T14:03:37+05:30 IST

క‌రోనా వేళ మ‌న సినీ తార‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా చిత్ర‌లేఖ‌నం వేస్తున్నార‌ట‌.

సోనాక్షి చిత్రలేఖ‌నం

క‌రోనా వేళ మ‌న సినీ తార‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వారికి దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని పుస్త‌కాలు చ‌దువుతూ, వంట వండుతూ, ఇల్లు శుభ్రం చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. ఈ ప‌నుల‌తో పాటు కొత్త విష‌యాల‌ను నేర్చుకోవ‌డంలో ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ కోవ‌లో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా చిత్ర‌లేఖ‌నం వేస్తున్నార‌ట‌. బొమ్మ‌లు వేయ‌డం కొన్నేళ్ల క్రిత‌మే నేర్చుకున్నాన‌ని, పెయిటింగ్ అనేది ఓ స్ట్రెస్ బ‌స్ట‌ర్ అని, బొమ్మ‌లు వేస్తుంటే మెడిటేష‌న్ చేస్తున్న‌ట్లు అనిపిస్తుంద‌ని సోనాక్షి తెలిపారు.  

Updated Date - 2020-04-28T14:03:37+05:30 IST