పోర్న్ సైట్స్ నుంచి ఆ సీన్ తీయించేందుకు 6 ఏళ్ళుగా పోరాడుతున్న నటి
ABN , First Publish Date - 2020-10-23T01:36:10+05:30 IST
తను మైనర్‌గా ఉన్నప్పుడు తీసిన కొన్ని అభ్యంతరకర సీన్లను తొలగించాలని ఓ నటి 6 ఏళ్లుగా పోరాడుతుంది. 7 సంవత్సరాల క్రితం సోనా ఎమ్ అబ్రహం అనే నటి మలయాళ చిత్రం

తను మైనర్‌గా ఉన్నప్పుడు తీసిన కొన్ని అభ్యంతరకర సీన్లను తొలగించాలని ఓ నటి 6 ఏళ్లుగా పోరాడుతుంది. 7 సంవత్సరాల క్రితం సోనా ఎమ్ అబ్రహం అనే నటి మలయాళ చిత్రం 'ఫర్ సేల్'లో నటించింది. అప్పుడు ఆమె వయస్సు 14 సంవత్సరాలు. 2013లో తెరకెక్కిన ఈ చిత్రంలో తనపై జరిగిన అత్యాచారం సంగతి తెలిసి తన సోదరి సంధ్య ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటుందని.. అయితే ఈ అత్యాచార సీన్.. అప్పుడు నేను చేయలేనని చెప్పినా దర్శకుడు సతీష్ అనంతపూరి, నిర్మాత ఆంటో కడవెలిల్‌లు వినలేదని ఆమె తాజాగా విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. 150 మంది మధ్యలో ఇలాంటి సీన్ చేయలేనని చెప్పడంతో.. దర్శకనిర్మాతలు నాతో బలవంతంగా ఓ రూమ్‌లో ఈ సీన్‌ని షూట్ చేశారని, వెంటనే ఆ షూట్ నుంచి వెళ్లిపోయానని సోనా పేర్కొంది.
సినిమాలో అవసరం మేరకు మాత్రమే ఈ సీన్ ఉపయోగిస్తామని.. మిగతా కంటెంట్ మొత్తం డిలీట్ చేస్తామని చెప్పిన వారు.. సినిమాలో ఆ సీన్‌ని చాలా వరకు కట్ చేసి చూపించారని తెలిపింది. కానీ సినిమాలో లేని ఈ సీన్.. పోర్న్ సైట్స్‌లో నార్మల్‌గానే రావడంతో.. వెంటనే దర్శకనిర్మాతలను ప్రశ్నించానని.. వారు ఎవరు నువ్వు? మాకేం తెలియదు అంటూ బుకాయిస్తున్నారని ఆమె భోరున విలపించింది. 2014లో ఎర్నాకుళం పోలీస్ కమీషనర్‌ని సంప్రదించగా.. అప్పట్లో టెంపరరీగా ఆ సీన్‌ని తొలగించారని, కానీ మళ్లీ ఆ వీడియో సైట్స్‌లో కనిపిస్తోందని.. ఇప్పటికైనా సైబర్ క్రైమ్ పోలీసులు, కేరళ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తారని చూస్తున్నట్లుగా ఆమె తెలిపింది. కాగా ఈ సీన్ విషయమై ఇప్పటికే సోనా.. ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తెలిసి తెలియని వయసులో ఇటువంటి సీన్ చేసి నేను చాలా పెద్ద తప్పు చేశానని తాజా వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.